![]() |
![]() |
.webp)
ఏదైన సరే మన దేశంలో మన ఊళ్ళో మన ఇంట్లో ఉన్నంత కంఫర్ట్ ఇంకెక్కడా ఉండదు. కొందరు లగ్జరీ కోసం ఖరీదైన హోటల్స్ కి వెళితే మరికొందరు లైఫ్ లో ఒక్కసారైన అందులో ఒకరోజు ఉండాలని సామాన్యులు అనుకుంటారు. అయితే పటాస్ ప్రవీణ్ రీసెంట్గా దుబాయ్ వెళ్ళాడు. అక్కడ తనకి ఎదురైనా అనుభవాలని చెప్తూ వ్లాగ్స్ చేస్తున్నాడు.
బజర్దస్త్ అనేది ఎంతోమంది కనుమరుగయిపోయిన వారికి, అప్‌కమింగ్ కమెడియన్లకు ఛాన్స్ ఇచ్చింది. అలాంటి వారిలో ఒకరు పటాస్ ప్రవీణ్. ముందుగా పటాస్ అనే స్టాండప్ కామెడీ షోతో పరిచయమయిన ప్రవీణ్.. తన ఐడెంటిటీనే పటాస్ ప్రవీణ్‌గా మార్చుకున్నాడు. దుబాయ్ లోని అన్ని టూరిజం లోకేషన్స్ చూసిన ప్రవీణ్ బాగా ఎంజాయ్ చేశాడు. అయితే అన్నీ చూడటానికి బాగున్నాయి కానీ ఏదైనా కాస్ట్లీ అని అంటున్నాడు. అది దుబాయ్ లోనే రిచెస్ట్ హోటల్ అని.. అందులో ఉండటానికి రోజుకే ఆరు లక్షలు అవుతాయని దానిని ఓ వీడియోలో చూపించాడు ప్రవీణ్. ఇప్పుడు దానిముందే ఉన్నానంటు మీరు ఇలాంటి లగ్జరీ హోటల్ లో ఉన్నారా? ఉంటే ఎక్కడ ఉన్నారంటు ప్రవీణ్ అడిగాడు. ఇక ఇన్ స్టాగ్రామ్ లో ఈ పోస్ట్ ని చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
దుబాయ్ లో బుర్జ్ ఖలీఫా, ఎడారిలో జీబ్ మీద ట్రావెలింగ్, ఒంటెలపై సవారి, వరల్డ్ ఫేమస్ హోటల్స్ అన్ని అక్కడే ఉన్నాయంటూ ప్రవీణ్ రకరకాల రీల్స్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ట్రెండింగ్ లో ఉన్నాడు. జబర్దస్త్ లో తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులని నవ్విస్తున్న ప్రవీణ్ .. సద్దాంతో కలిసి అంతకముందు శ్రీదేవీ డ్రామా కంపెనీలో చేశాడు. ఇప్పుడేమో తన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటు వస్తున్నాడు.
![]() |
![]() |